తని ఒరువన్ అంటూ తమిళం నుండి తీసుకొచ్చిన కథను ఇప్పుడు తెలుగులోకి మార్చేస్తూ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గీతా ఆర్ట్స్ వారు ఈ రోజే కొత్త సినిమాను మంచి ముహుర్తంలో పట్టాలెక్కించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్; అరవింద్ స్వామీ, పోసాని అండ్ నాజర్ ముఖ్య విలన్లు. తని ఒరువన్ తమిళ మాతృకలో టెక్నికల్ అండ్ కెమెరా వర్క్ అత్యద్భుతంగా ఉంటుంది. సైన్సు బేస్ ఉన్న ఫిలిం కాబట్టి ఎక్కడ డబ్బులు పోయాలో అక్కడ సరిగ్గా పోశారు గనకే జయం రవికి సూపర్ హిట్టు తగిలింది. కథలో మాత్రమే కాదు మ్యూజిక్ విషయంలోనూ తెలుగులో ఎటువంటి తప్పిదాలు జరక్కూడదని అక్కడ వాడిన హిప్ హాప్ తమిజానే ఇక్క చరణ్ వాడేస్తున్నాడు. సినిమాటోగ్రఫిలో భాగంగా తమిళం కంటే తెలుగులో మరింత క్వాలిటీ ఉండాలనే ఆలోచనతో ఆసీం మిశ్రాను ఎంచుకున్నారు. ఇటువంటి విషయాలలో సురేందర్ రెడ్డికి అవగాహన ఎక్కువ. రేస్ గుర్రం కోసం కెమెరామెన్ మనోజ్ పరమహంసను ఎంచుకున్న తీరు ఆ సినిమా స్థాయినే మార్చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో కూడా వెనకాడే సమస్యే లేదంటూ బాలివుడ్ ఫేమస్ అండ్ బిజీ పర్సన్ ఆసీం మిశ్రాను దిగుమతి చేసుకున్నారు. ఇక తెలుగు వర్షన్ క్వాలిటీలో ఒరిజినలుని మించి ఉంటుంది అనడంలో సందేహం అక్కర్లేదు.