Advertisementt

మెగా అభిమానులకు జాతర టైం!

Fri 19th Feb 2016 12:11 PM
mega family releases,april may,summer festival  మెగా అభిమానులకు జాతర టైం!
మెగా అభిమానులకు జాతర టైం!
Advertisement
Ads by CJ

మా ఫ్యామిలీలోనే ఇంత మంది హీరోలం ఉన్నాం. ఇంక మిగతా వాళ్లకు చోటెక్కడ అన్నట్టుగా ఉంది మెగా ఫ్యామిలీ వేసవి తాపం. అది ప్రీ ప్లాన్ అయుండొచ్చు లేదా యాదృచ్చికం అయుండొచ్చు, బట్ మెగా అభిమానులకి పండగే పండగ. ఏప్రిల్ నుండి మొదలెడితే మే వరకు సమ్మర్ క్రీం మొత్తం మెగా కుటుంబం సినిమాలతోనే సరిపోయేట్టు ఉంది. మెగా వారసులు అందరి నుండి ఒక్కో చిత్రం రిలీజుకు సిద్ధమవుతున్నాయి. ఫస్ట్ ఏప్రిల్ 1న సుప్రీంతో ఈ జాతర మొదలు. సాయిధరం తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కలయికలో వస్తోంది ఈ యాక్షన్ మూవీ. అక్కడ వారం ఆగండి, ఇక ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ అలరించనున్నాడు. అలా ఇలా కాదు, బాబీ దర్శకత్వ వహిస్తున్న ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ ఉతికి ఆరేసేలా ఉంది. ఇంకా ఫిక్స్ అవలేదు గానీ 8కి అటు ఇటుగా కొణిదెల నిహారిక, నాగబాబు గారి అమ్మాయి ఒక్క మనసు కూడా మనలను హత్తుకోబోతోంది. రామరాజు దర్శకత్వం వచించిన ఈ మూవీ ప్యూర్ రొమాంటిక్ అంటున్నారు. నెలాఖరు దాకా మీరు ఈ మూడింటితో గడపండి. అప్పుడు వస్తాడు అల్లు అర్జున్ సరైనోడు. ఏప్రిల్ 28 విడుదల అంటున్నారు కాబట్టి అదే రైట్ టైం. ఆఖరుగా మే నెలలో అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. మిగతా నిర్మాతల, బయ్యర్ల పరిస్థితి ఏమిటో గానీ మెగా సినిమాల మీద పెట్టుబడి పెట్టినోల్లకి మాత్రం సొంతింటి నుండే ఇంత పోటీ రావడంతో కాస్తంత భయపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ