అల్లు అర్జున్ సరైనోడు టీజర్ గూర్చి పొద్దున్నుండి వెయిటింగ్ సేస్తున్న ఫ్యాన్సు ఫుల్ హ్యాపీస్ అయిపోయారు. అల్లు అర్జున్ అంటేనే స్టైల్, అలాగే బోయపాటి శ్రీను అంటేనే యాక్షన్. ఇక స్టైలిష్ స్టార్ స్టైల్, బోయపాటి యాక్షన్ సరిగ్గా మేళవించిన టీజర్ ఈ సరైనోడు. ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ, ఈ టీజర్ కేవలం యూట్యూబులో మాత్రమే కాకుండా సుమారు వెయ్యి థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. మొదటి నుండి ఈ చిత్రంలో బన్నీని యాక్షన్ ఓరియెంటెడ్ గానే చూపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో వ్యాయామశాలలో వాడే కెటిల్ బెల్ చేతిలో పట్టుకున్న బన్నీని ఎస్టాబ్లిష్ చేసారు గనక ఇక్కడ కూడా అదే వ్యాయామశాలలో వస్తాదులను మట్టికరిపిస్తున్నట్టుగా చూపించారు. అటు తరువాత శ్రీకాంత్, జయ ప్రకాష్ రెడ్డిలతో స్టైలిష్ లుక్కులో బన్నీ పబ్బులోకి వెళ్ళడం కూడా బాగుంది. ఇక పంచ్ డైలాగ్ అంటారా. ఎర్ర తోలు కదా స్టైలుగా ఉంటాడనుకుంటున్నావేమో, మాస్ ఊర మాస్ అంటూ బలిష్టమైన రౌడీని ఒంటి చేత్తో ఎత్తి అవతేలేసి పడేసాడు. అటు తరువాత జాతరలో పులి వేషాల మధ్యలో నుండి అర్జున్ నడిచిరావడం చూస్తుంటే ఇది కదా ఊర మాస్ అంటే అనిపించింది. తమన్ మ్యూజిక్ కూడా చించేసింది. మొదటి టీజర్ ద్వారా బోయపాటి శ్రీను గారు, దిస్ ఈజ్ మై మార్క్ మూవీ అంటూ DTSలో చాటింపు వేసేసారు. అల్లు అర్జున్ క్రేజ్ అంతర్జాలంలో అరాచకం. ఇక యూట్యూబులో రికార్డుల మోతరే!