మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా, నదియా కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం 'అ...ఆ'. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సివుంది. కానీ అనుకోకుండా సంగీత దర్శకుడు అనిరుద్ స్థానంలో మిక్కీజేమేయర్‌ను పెట్టుకోవడంతో ఈ చిత్రం కాస్త ఆలస్యమైంది. అయినా కూడా ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80శాతం పూర్తయింది. పొలాచ్చిలో నితిన్, సమంతలపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా రూపొందిస్తున్నాడు నిర్మాత రాధాకృష్ణ. ఇప్పటికే ఈ చిత్రం ఏప్రిల్ 22 వతేదీన విడుదలకు డేట్‌ను లాక్ చేశారు. అప్పటికి 'సర్దార్ గబ్బర్‌సింగ్' విడుదలై రెండు వారాలు పూర్తవుతాయి. ఇక ఆపై వారం బన్నీ 'సరైనోడు' విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న స్టార్ హీరోల చిత్రాల మద్య ఈ 'అ..ఆ'ను సైలెంట్ కిల్లర్‌గా దించనున్నాడు త్రివిక్రమ్. వాస్తవానికి త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేస్తున్న చిత్రం అంటే అవి ఎప్పుడూ మంచి హైప్‌తో రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ 'అ..ఆ' చిత్రానికి మాత్రం ఇప్పటికిప్పుడే భారీ హైప్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు త్రివిక్రమ్. ఎలాంటి అంచనాలు లేకుండా, హడావుడి లేకుండా, ఈ చిత్రం లోగో డిజైన్‌ను విడుదల చేసిన త్రివిక్రమ్ ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల చేసిన పోస్టర్‌ని సైతం సైలెంట్‌గా వదిలాడు. మరి ఇంత లోప్రొఫైల్‌లో రూపొందుతున్న ఈ చిత్రం విడుదయిన తర్వాత మాత్రం సంచలనాలు సృష్టించడం ఖాయం అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు.