సినిమా అనేది ఒక పరిపూర్ణమైన వ్యాపారం. ఇక్కడ డబ్బులే అంతిమ లక్ష్యం తప్ప మరోటి లేదు. ఈ మధ్య తాను చేస్తున్న కొత్త సినిమాలలో మహేష్ బాబు స్వయంగా నిర్మాణ భాగస్వామ్యం తీసుకోవడం అందరికీ కొత్తగా అనిపించినా హీరోగా వచ్చే పారితోషికం కన్నా ఇక్కడ ఎక్కువగా ముడుతుంది కాబట్టే ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడు అన్నది ఓ వాదన. అందుకు తగ్గట్టుగానే మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ ముద్ర బ్రహ్మోత్సవం చిత్ర పోస్టర్ల మీద కనపడడంతో PVP వారితో మహేష్ ఓ ఒప్పందానికి వచ్చుంటాడని అర్థమయింది. ఇలాంటి డీల్ శ్రీమంతుడు చిత్రంతో కూడా చేసుకుని పెక్కు లాభాలు సంపాదించాడు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబుకు బ్రహ్మోత్సవం నిర్మాణంలో వాటా లేదని తెలుస్తోంది. ముందుగా పార్టనర్ షిప్ ఒప్పందం మీదే ప్రాజెక్టు పట్టాలెక్కినా, క్రమంగా సినిమా పూర్తవుతున్న తరుణంలో మహేష్ వెనక్కి జరగడం ఏంటని అనుమానం కలిగినా దీనికి తెర వెనక వేరే విషయం లేకపోలేదు. PVP అధినేత పొట్లూరి వర ప్రసాద్ గారు అక్షరాలా 25 కోట్ల పారితోషకం మహేష్ బాబుకు ముట్ట చెప్పడం ఇక్కడ అసలు కిటుకు. ఫైనలుగా చెప్పాలంటే మహేష్ బాబు పేరు బ్రహ్మోత్సవం నిర్మాణంలో ఇక లేనట్టే. హీ ఈజ్ జస్ట్ హీరో ఆఫ్ ది ప్రాజెక్ట్.