Advertisementt

మళ్ళీ వచ్చేస్తున్న కోన వెంకట్!

Wed 17th Feb 2016 04:39 PM
kona venkat,prabhu deva,tamanna,al vijay  మళ్ళీ వచ్చేస్తున్న కోన వెంకట్!
మళ్ళీ వచ్చేస్తున్న కోన వెంకట్!
Advertisement
Ads by CJ

వరస పెట్టి ఫ్లాప్ కథలు రాస్తున్నాడు, అంతకు మించి అరాచకమైన స్క్రీన్ ప్లేతో జనాల మతులు పోగొట్టి తెలుగు సినిమా కమర్శియల్ స్థాయిని ఒకనాడు పైకి లేపిన కోన వెంకట్ ఈరోజు పతనానికి కూడా తానే కారణమయ్యాడు. ఇక దొరికిన చోటల్లా మీడియా జనాలు, సామాన్య జనాలు కోన గారిని ఏకిపారేస్తుంటే పాపం ఈ మధ్య బయట కనపడడమే మానేసాడు. మళ్ళీ నిద్రలేచిన సింహం మాదిరిగా ప్రభు దేవా, తమన్నాలు నటిస్తున్న ఓ హారర్ కామెడీ చిత్రాన్ని తమిళంలో AL విజయ్ దర్శకత్వం వహిస్తుంటే దాన్ని తెలుగులోకి అనువదించే బాధ్యతతో పాటుగా రిలీజ్ బాధ్యతలు కూడా నెత్తిన వేసుకున్నాడు. ప్రభుదేవా సొంత నిర్మాణ సంస్థ మీద రూపొందుతున్న ఈ చిత్రం సెట్స్ మీదకు కూడా వెళ్లినట్టు సమాచారం. MVV సినిమాస్ బ్యానర్ పేరు మీద ఇంతకు మునుపు గీతాంజలి, త్రిపురలలో MVV సత్యనారాయణ గారితో నిర్మాణ బాధ్యతలు పంచుకున్న కోన వెంకట్ ఈసారి ముచ్చటగా మూడోసారి ఇంకో దయ్యం సినిమాతో వస్తున్నాడు. ఇక్కడితో అతడి దశ తిరగాలని ఆశిద్దాం. ఈ మధ్యలో ఎల్లుండి రిలీజవుతున్న కృష్ణాష్టమికి కూడా కోన గారే కథ అందించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ