Advertisementt

చరణ్‌కి ఈ తలనొప్పి ఎక్కువైందట.!

Wed 17th Feb 2016 02:14 PM
hero ramcharan,ramcharan latest movie thani oruvan remake,thani oruvan remake will start soon,surender reddy remakes thani oruvan  చరణ్‌కి ఈ తలనొప్పి ఎక్కువైందట.!
చరణ్‌కి ఈ తలనొప్పి ఎక్కువైందట.!
Advertisement
Ads by CJ

తమిళ్‌లో సూపర్‌హిట్‌ చిత్రంగా సంచలనం సృష్టించిన తనిఒరువన్‌ చిత్రాన్ని తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్‌ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చే పనిలో వున్నారు సురేందర్‌రెడ్డి అండ్‌ టీమ్‌. తని ఒరువన్‌ తెలుగులో రీమేక్‌ అవుతోందన్న వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ఈ సినిమా గురించి మీడియాలో ఎన్నో ఊహాగానాలు, మరెన్నో వార్తలు వస్తున్నాయి. చరణ్‌కి ఇది పెద్ద తలనొప్పిలా తయారైందట. 

ఈనెలలోనే ఈ చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుండగా చరణ్‌, సురేందర్‌రెడ్డిలతోపాటు యూనిట్‌ అంతా ఆ బిజీలో వుండగా మరోపక్క ఈ సినిమాకి ఎలాంటి టైటిల్‌ పెట్టబోతున్నారన్న డిస్కషన్‌ మీడియాలో ఎక్కువైపోయింది. రక్షక్‌ అనే టైటిల్‌ అనుకున్నారని, దాన్నే ఫిక్స్‌ చేసే అవకాశం వుందని నిన్న మొన్నటి వరకు అనుకున్నారు. ఇప్పుడు తాజాగా రక్షక్‌ టైటిల్‌ కానే కాదని ధ్రువ్‌ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకి ప్రస్తుతానికి ఎలాంటి టైటిల్‌ని అనుకోలేదని, ఏ టైటిల్‌ పెట్టాలన్న ఆలోచన కూడా చెయ్యలేదని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అసలే బ్రూస్‌లీ డిజాస్టర్‌తో డిప్రెషన్‌లో వున్న చరణ్‌కి కొత్త సినిమా టైటిల్‌ గురించి వస్తున్న రకరకాల వార్తలు అతనికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ