Advertisementt

'బాహుబలి' ఆ రికార్డు సాధిస్తుందా..!!

Wed 17th Feb 2016 02:06 PM
bahubali,pk,bajrangi bhaijaan,indian record,bahubali movie records  'బాహుబలి' ఆ రికార్డు సాధిస్తుందా..!!
'బాహుబలి' ఆ రికార్డు సాధిస్తుందా..!!
Advertisement
Ads by CJ

సరికొత్త చరిత్ర లిఖించి, తెలుగు బాక్సాఫీస్‌ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది రాజమౌళి 'బాహుబలి'. దాదాపు 550కోట్లు వసూళ్లతో కనివినీ ఎరుగని ప్రభంజనం సాధించింది. 'పీకే, భజరంగీ బాయిజాన్‌' చిత్రాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఇప్పుడు 'పీకే' రికార్డును అధిగమించి నెంబర్‌వన్‌గా ఎదగాలని చూస్తోంది. 'బాహుబలి'కి ఆ అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 'పీకే' సాధించిన వసూళ్లు దాదాపు 750కోట్లు. అంటే 'బాహుబలి' కంటే 200కోట్లు ఎక్కువన్న మాట...! ఈ లోటును భర్తీ చేయడానికి 'బాహుబలి'కి ఓ అవకాశం దక్కింది. 'బాహుబలి'ని అతి త్వరలోనే చైనాలో విడుదల చేయబోతున్నారు. అక్కడ దాదాపు 6 వేల స్క్రీన్లలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. భారత్‌ నుండి వచ్చిన సినిమాలకు అక్కడ ఆదరణ అద్భుతంగా ఉంటుంది. అందులోనూ చారిత్రక, విదేశీ సంస్కృతిక, సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలకు అక్కడ భలే గిరాకీ ఉంటుంది. అక్కడ 200కోట్లు సాదించడం పెద్దకష్టమైన విషయమేమీ కాదు. ఒకవేళ అన్ని అనుకొన్నవి అనుకున్నట్లు జరిగితే చైనాలో కూడా 'బాహుబలి' రికార్డులు బద్దలు కొడితే 'పీకే' రికార్డుకు గండిపడే అవకాశం ఉంది. కనీసం 'భజరంగీ భాయిజాన్‌'ని వెనక్కినెట్టి రెండో స్థానమైనా ఆక్రమంచుకునే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ