Advertisementt

ముందు ఖాళీయేగా, వచ్చేయండి!

Wed 17th Feb 2016 01:45 PM
kshanam,release date,february 26 or march 4  ముందు ఖాళీయేగా, వచ్చేయండి!
ముందు ఖాళీయేగా, వచ్చేయండి!
Advertisement
Ads by CJ

ఈ వారం అంటే 19వ తారీఖున ముచ్చటగా మూడు చిత్రాలు కృష్ణాష్టమి, మలుపు అండ్ యమపాశం మన మీదకు దండెత్తబోతున్నాయి. అటు తరువాత 26వ తేదీకి మీకు మీరే మాకు మేమే, పడేసావే, అప్పుడలా ఇప్పుడిలా చిత్రాలు క్యూ కట్టేలా ఉన్నాయి. మూడు చిన్న చిత్రాలే కావడంతో, అటు తరువాత వారం అంటే మార్చి 4వ రోజు మూకుమ్మడిగా 5 మూవీస్, శ్రీకాంత్ టెర్రర్, నాగశౌర్య కళ్యాణ వైభోగమే, మంచు మనోజ్ శౌర్య, నారా రోహిత్ తుంటరి అండ్ PVP వారి క్షణం తమ తమ స్లాట్స్ బుక్ చేసుకున్నాయి. ఒకేసారి 5 సినిమాలు, అందునా కొన్ని మీడియం బడ్జెట్ చిత్రాలు పోటీ పడడం అంత ఆరోగ్యకరం కాకపోవడంతో ఇందులో ఒకటో రెండో తమ రిలీజ్ తారీఖుని కనీసం ఒక్క వారం ముందుకు జరుపుకొని ఫిబ్రవరి 26కి మూవ్ అవాలని కొందరు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా PVP వారి క్షణం ప్రోడక్ట్ రెడీగా ఉండడంతో ఆ దిశగా చర్చలు సాగుతున్నాయి. అన్నీ కుదిరితే ఖాళీగా ముందు సీట్లలోకి క్షణం ఆలోచించకుండా దూరిపోతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ