Advertisementt

మరో కాజల్ అగర్వాల్ అవుతుందా?

Wed 17th Feb 2016 09:24 AM
mehrene,krishna gadi veera prema gaadha  మరో కాజల్ అగర్వాల్ అవుతుందా?
మరో కాజల్ అగర్వాల్ అవుతుందా?
Advertisement
Ads by CJ

లక్ష్మి కళ్యాణం సినిమాలో కాజల్ అగర్వాల్ ముఖంలో ఆకర్షణా శక్తిని సినిమా పరిశ్రమ ముందే పసిగట్టింది. అందుకే కొన్ని చిత్రాలు తిరిగేలోపే స్టార్ హీరోయిన్ అయి కూర్చుంది. సరిగ్గా మళ్ళీ అవే ఛాయలు ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయి మెహ్రీన్, అదేనండి కృష్ణగాడి వీరప్రేమగాధ హీరోయిన్లో కనిపిస్తున్నాయి అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. చిక్కనైన స్కిన్ టోన్, చక్కనైన శరీర సౌష్టవం, అందమైన కళ్ళతో అందరినీ మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది మెహ్రీన్. నిజానికైతే నాని పక్కన ఆనాలంటే కొంచెం బరువు తగ్గించాలని నిర్మాతలు, దర్శకుడు కోరినప్పటికీ తాను ఇలా ఉంటేనే బాగుంటానని టీం మొత్తాన్ని ఒప్పించి మరీ ఇప్పుడు జనాన్ని మెప్పించింది. ఏ తెలుగు చిత్రం అయినా హిట్టవడంలో హీరోయిన్ పాత్ర తక్కువే అయినా కృష్ణగాడి యూనిట్ మాత్రం మెహ్రీన్ కూడా పాత్రలో చక్కగా ఒదిగిపోయిందని మెచ్చుకుంటున్నారు. ఇక ఫస్ట్ సినిమాతో బ్రేక్ ఎలాగో వచ్చింది గనక దీన్ని చక్కగా వినియోగించుకొని మరిన్ని మంచి పాత్రలని, పెద్ద ప్రాజెక్టులని పట్టుకుంటూ మెహ్రీన్ కూడా కాజల్ అగర్వాల్ లాగా స్టార్ హీరోయిన్ అయిపోవాలని కోరుకుందాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ