రజనీకాంత్ సినిమా అంటే యావత్ భారతదేశం ఎదురుచూస్తుంది. ఇతర దేశాల్లోనూ చాలా ప్రాంతాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీటిని రీచ్ అవ్వాలంటే దర్శకుడు ఎన్నో సర్కర్స్ ఫీట్స్ చేయలి. లేకపోతే మరో 'లింగా' రావచ్చు. లేదా మరో 'కొచ్చాడయాన్' కావచ్చు అనే భయం ఉంటుంది. అందుకే దర్శకుడు శంకర్ తన తాజా చిత్రం 'రోబో 2.0' కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు. కొత్త సెట్స్ వేసి ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా దాదాపు 250కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం స్థానిక పూందమల్లి సమీపంలో 20కోట్లు ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేస్తున్నారు. అక్కడ పది ఎకరాల స్థలంలో మోడరన్ సిటీ రెడీ చేస్తున్నారు. ఈ సెట్‌లో యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీపైట్స్ తన టీమ్‌తో చెన్నై చేరుకున్నాడు. ఆ సెట్‌లో ఇప్పటికే ఫైట్స్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. ఈ స్టంట్ మాస్టర్ 'ది రాక్, ట్రైనింగ్ డే సీక్వెల్' వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేశాడు. అలాగే ఈ చిత్రంలో కొన్ని పైట్ సీన్స్‌ను చిత్రీకరించడానికి కొన్ని ఆధునిక త్రీడీ కెమెరాలను రప్పించారు. రజనీ సరసన బ్రిటన్ బ్యూటీ ఎమీజాక్సన్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా చేస్తున్నాడు. చెన్నైలో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నేతృత్వంలో తాజా షెడ్యూల్ ఈనెల 18 నుంచి చెన్నైలోని ఈ సెట్‌లో ప్రారంభం కానుంది.