Advertisementt

నారా రోహిత్ ప్లానింగ్‌ మిస్‌ అవుతోంది..!

Tue 16th Feb 2016 06:11 PM
nara rohit,thuntari,savithri,appatlo okadundevadu  నారా రోహిత్ ప్లానింగ్‌ మిస్‌ అవుతోంది..!
నారా రోహిత్ ప్లానింగ్‌ మిస్‌ అవుతోంది..!
Advertisement
Ads by CJ

యువహీరో నారారోహిత్‌ విభిన్నమైన చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ... నాటి 'బాణం' నుండి నిన్నటి 'అసుర' వరకు తనదైన శైలిలో చిత్రాలు చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఈ యువహీరో చేతిలో ఏ హీరోకి లేనన్ని చిత్రాలు ఉన్నాయి. ఆయన నటించిన 'తుంటరి, సావిత్రి' చిత్రాలు షూటింగ్‌ చివరి దశకు వచ్చేసాయి. ఇక ఆయన ఖాతాలో 'అప్పట్లో ఒకడుండే వాడు, పండగలా వచ్చాడు, వీరుడు, కథలో రాజకుమారి, శంకర్‌, జోఅచ్యుతానంద, రాజా చేయి వేస్తే' చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో ఏ సినిమా ఏ స్టేజీలో ఉందో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో అనే క్లారిటీయే లేదు. మరి ఆయన తన దగ్గరకు వచ్చిన విభిన్నచిత్రాలన్నింటినీ ఒప్పుకోవడంలో తప్పులేదు. కానీ అదే సమయంలో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో అనే క్లారిటీ మిస్‌ అయితే అది హీరోగా రోహిత్‌కే కాదు.. ఆయా చిత్రాల దర్శకనిర్మాతలకు కూడా ఇబ్బంది కలిగించే అంశమే అయి, కెరీర్‌ అస్తవ్యస్తంగా తయారవుతుందనే విషయం ఆయన గమనించాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ