సమంతా అంటే చక్కటి చీరకట్టు, అందమైన నవ్వుతో, చూడముచ్చటగా ఉంటుంది అన్నది ఏ మాయ చేసావేతో అందరిలో ఏర్పడ్డ భావన. కానీ అమ్మడు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చేతుల్లో పడినప్పటి నుండీ ఒళ్ళు తెలియకుండా హీరోలతో హాట్ హాట్ రొమాన్స్ చేస్తూ స్కిన్ షో మోతాదు కూడా పెంచేసింది. బావంటే ఇంతలా నలిపేయాలా అన్న చందంగా అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ బావని చూడగానే పిచ్చి గుండె గట్టిగానే కొట్టుకునేలా చేసింది అదేమిటో. అటు తరువాత సన్నాఫ్ సత్యమూర్తిలో షుగర్ పేషెంట్ అయినా మనకు మాత్రం తీయదనమే పంచింది. ఇక త్రివిక్రమ్ ముచ్చటగా సమంతాని మూడో సారి కూడా వాడేస్తున్నాడు. నితిన్ హీరోగా వస్తున్న త్రివిక్రమ్ కొత్త చిత్రం అ... ఆలో కూడా సమంతాను చూస్తే అమ్మో అంతలానా అనేలా వేడి వేడి అందాలను వడ్డిస్తానంటోందట. పొలాచ్చిలో మొదలయిన కొత్త షెడ్యూలులో ప్రేమ సన్నివేశాలు మరియు ఒక పాటలో అందమైన సమంతాను మనం మెచ్చేలా మరింత అందంగా చూపించబోతున్నారంట త్రివిక్రమ్ గారు. తతంగం చూడబోతే హీరోగా నితిన్ మీద కంటే సమంతా అందం మీదే సినిమా ఎక్కువగా అమ్ముడయ్యేలా ఉంది. ఇదో రకం స్ట్రాటజీ!