ప్రియాంకా చోప్రా.. ఇప్పుడు బాలీవుడ్‌లో ఈమెకు ఓ ప్రత్యేకస్థానం ఉంది. ఆల్‌రౌండర్‌గా అన్ని రకాల పాత్రల్లో ఆమె దూసుకుపోతోంది. గ్లామర్‌షోతో మతులు పోగొట్టాలన్నా..లేక అభినయంతో అదరగొట్టాలన్నా అది ప్రియాంకాచోప్రాకే సాధ్యం అంటున్నాయి బాలీవుడ్ విశ్లేషణలు. ఎలాంటి పాత్రలను పోషించాలన్నా ఈమెకే సాధ్యం అనేది ఇప్పుడు బాలీవుడ్‌లో వినిపించే మాట. ఆమె తన కెరీర్‌లో అన్నిరకాల పాత్రలు చేసింది.. చేస్తూనే ఉంది. తాజాగా ఆమె నటించిన 'జై గంగాజల్' చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈనాటి రాజకీయాలను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని టాక్.ఈ చిత్రానికి ప్రకాష్‌ఝూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రియాంకాచోప్రా పవర్‌ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తోంది. ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ చేయడంలో ఆమె దిట్ట. దీంతో పాటు ఈ చిత్రం ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. ఇందులో ప్రియాంకాచోప్రా చేసిన యాక్షన్ ఎపిసోడ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే ఆమె మధుర్‌బండార్కర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో కూడా ఓ విభిన్నపాత్రను చేస్తోందని సమాచారం. మరి 'జై గంగాజల్'తో ఆమె కెరీర్ మరింత ముందుకు దూసుకుపోతుందని బాలీవుడ్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి.