Advertisementt

పూరీ దృష్టి ఆమెపై పడింది..!

Mon 15th Feb 2016 08:31 PM
puri jagannath,mehrene,krishnagadi veeraprema gada  పూరీ దృష్టి ఆమెపై పడింది..!
పూరీ దృష్టి ఆమెపై పడింది..!
Advertisement
Ads by CJ

కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో పూరీ అందరి కంటే ముందుంటాడు. ఎక్కడ అవకాశం వచ్చినా ఆయన కొత్త హీరోయిన్లను పరిచయం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. తాజాగా ఆయన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయిన మెహ్రీన్‌కు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. సాధారణంగా ఎవరైనా శుభాక్షాంలు తెలపాలనుకుంటే మొత్తం చిత్రానికి, దర్శకునికి, హీరోకి, హీరోయిన్‌కి ... ఇలా అందరికీ శుభాకాంక్షలు తెలపడం సహజం కానీ పూరీ మాత్రం కేవలం ఈ కొత్త హీరోయిన్‌కు మాత్రమే తన బెస్ట్‌ విషెస్‌ను తెలియజేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అలాగే 'క్షణం' ట్రైలర్‌ చూసి తాను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఆదాశర్మకు విషెష్‌ చెప్పాడు. మెహ్రీన్‌ను ఉద్దేశించి ఆయన 'నీ మొదటి సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను...' అని ట్వీట్‌ చేశాడు. కాగా త్వరలో పూరీ నందమూరి కళ్యాణ్‌రామ్‌, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ చిత్రాలకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒక దానిలో ఆయన మెహ్రీన్‌కు అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌ జరుగుతోంది. మొత్తానికి తన ట్వీట్‌తో మెహ్రీన్‌ ఇమేజ్‌ను పెంచేశాడు పూరీజగన్నాథ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ