Advertisementt

హాలీవుడ్‌పై కన్నేసిన లోకనాయకుడు....!

Mon 15th Feb 2016 08:28 PM
kamal hassan,hollywood project,ramyakrishna,sruthihassan  హాలీవుడ్‌పై కన్నేసిన లోకనాయకుడు....!
హాలీవుడ్‌పై కన్నేసిన లోకనాయకుడు....!
Advertisement
Ads by CJ

భారత సినీ చరిత్రలోనే కమల్‌హాసన్‌ లోకనాయకుడు. ఆయన నటనాపటిమ తెలిసిన వారు ఆయన్ను మించిన నటుడు లేడు అంటుంటారు. అది నిజం కూడా. కాగా ఇండియా నుండి ఇటీవలి కాలంలో కొద్దిమంది నటీనటులు హాలీవుడ్‌లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. కాగా కమల్‌హాసన్‌ తాజాగా ఓ హాలీవుడ్‌ సినిమాకు దర్శకనిర్మాణ బాధ్యతలతో పాటు హీరోగా కూడా నటించనున్నాడు. 60ఏళ్ల ఈ వయసులో కూడా కమల్‌హాసన్‌ 20ఏళ్ల కుర్రహీరోలతో పోటీ పడుతూ ఏడాదికి నాలుగైదు చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన స్నేహితుడు, మలయాళ దర్శకుడు రాజీవ్‌కుమార్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయన సరసన హీరోయిన్‌గా రమ్యకృష్ణ నటిస్తుండగా, ఓ కీలకపాత్రలో ఆయన గారాలా పట్టి శృతిహాసన్‌ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం పూర్తయిన తర్వాత కమల్‌ తన మరో జర్నీని మొదలుపెడుతున్నాడు. హాలీవుడ్‌కు పయనం అవుతున్నాడు. యూఎస్‌లోని తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి కమల్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా మారి, తన దర్శకత్వంలో తానే హీరోగా ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే ఏడాదే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్‌ పనులు మొదలు పెట్టాడు. మరి ఇక్కడిలాగానే కమల్‌ అక్కడ కూడా ఎలాంటి మాయ చేస్తాడో... అక్కడి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో వేచిచూడాల్సివుంది....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ