మంచు మనోజ్, ప్రణతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల రోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మనోజ్ ప్రేమ పట్ల తనకు ఉన్న అభిప్రాయాన్ని, తన ప్రేమ విశేషాల గురించి చెప్పుకొచ్చాడు. అమ్మాయిని ప్రేమించడం అంటే ఆమె అలవాట్లను, ఆమె అభిరుచులను గౌరవించడం అంటూ ప్రేమపై తన ఒపీనియన్ చెప్పాడు. అదే సమయంలో పెళ్ళికి ముందు తన భార్య ప్రణతికి వేరే వాళ్ళతో జరిగిన పెళ్లి చూపులను చెడగొట్టానని చెప్పాడు.
నిజానికి ప్రణతి, మనోజ్ వదిన స్నేహితురాలు. తన వదినను కలవడానికి ఇంటికొచ్చిన ప్రణతిని చూసిన మనోజ్ పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని భావించాడట. ఓ రోజు రెస్టారంట్ కు వెళ్ళిన మనోజ్ అక్కడ ప్రణతి, తన వదిన, వేరే అబ్బాయితో రావడం చూసి విషయం తెలుసుకోవాలని వాళ్ళ దగ్గరకు వెళ్ళాడట. ప్రణతికి ఇష్టం లేకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసారని తెలిసి అవి చెడగొట్టాలని ప్లాన్ చేసాడట. అర్జెంట్ పనుందని చెప్పి అక్కడ నుండి ప్రణతిని తీసుకువెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు నుండి వాళ్ళ మధ్య బందం ఏర్పడింది. ఎప్పుడూ మనసులో ప్రేమ ఉన్నా 'ఐ లవ్ యూ' లు చెప్పుకోలేదు అన్న విషయాన్ని బయట పెట్టాడు మనోజ్.