'భలేభలే మగాడివోయ్' చిత్రంతో నాని రేంజ్ బాగా పెరిగింది. ఈ చిత్రంతో నాని 35కోట్ల వసూళ్లు సాధించాడు. తాజాగా ఆ సినిమా ఎఫెక్ట్ శుక్రవారం విడుదలైన నాని తాజా చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' బిజినెస్‌పై కూడా పడింది. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. అంతేకాదు. ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి షో నుండే ఈ చిత్రానికి మరీ ముఖ్యంగా నాని నటనకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ''భలే భలే మగాడివోయ్' స్థాయిలో కాకపోయినా ఈ చిత్రం కూడా మంచి హిట్టు దిశగానే సాగుతోంది. రివ్యూలు, విమర్శకుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్సే లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జెమిని చానెల్ 4కోట్ల 10లక్షలకు సొంతం చేసుకుంది. నాని కెరీర్‌లో ఇదో రికార్డు. 'భలేభలే మగాడివోయ్' చిత్రానికి శాటిలైట్ రేటు 3.5కోట్లు పలికింది. దానితో పోలిస్తే 'కృష్ణగాడి వీరప్రేమగాథ' 60లక్షలు ఎక్కువే పలికింది. ఈ సినిమా కూడా హిట్టవ్వడంతో నాని మరుసటి చిత్రాలకు 5కోట్ల వరకు శాటిలైట్ రావచ్చని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే కాస్త అటు ఇటుగా నాని కూడా స్టార్ హీరోల సరసన చేరిపోతున్నాడన్నమాట..!