బన్నీ పాటకు స్టెప్ వేశాడంటే థియేటర్ అంతా విజిల్స్ మోతమోగాల్సిందే. ఇక తన డాన్స్ ఎనర్జీకి తగ్గ మాస్ బీట్ కుదిరిందంటే థియేటర్‌లో కోలాహలానికి అవధులే ఉండవు. ఇక తన నోట పాట వచ్చిందంటే ప్రేక్షకుల్లో ఎనర్జీకి కూడా హద్దులుండవు. ఆ సమయం రానే వచ్చింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'సరైనోడు' చిత్రంలో బన్నీ ఓ పాట పాడారు. ఇప్పటికే మహేష్‌బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో పాటల్ని పాడించి వాళ్లలోని గాయకులను బయటకు తీసిన తమన్ ఇప్పుడు అల్లు అర్జున్‌ని గాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే చెన్నైలో ఆ పాటను తమన్ రికార్డ్ చేశారు. మరి బన్నీలోని ప్రతిభను తమన్ ఎంత వరకు బయటకు తీసుకొచ్చాడనేది తెలుసుకోవాలంటే వేసవి వరకు వెయిట్ చెయ్యాల్సిందే. గతంలో చిరంజీవి కూడా గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన 'మాస్టర్' సినిమాలో తొలిసారి పాట పాడి తన సత్తా చాటుకున్నారు. అప్పటి నుంచి తను నటించిన పలు చిత్రాల్లో చిరు పాటలు పాడుతూ వచ్చారు. ఇప్పుడు బన్నీ కూడా సొంత బ్యానర్‌లోనే పాట పాడడం విశేషం.