Advertisementt

రేట్లు తగ్గించి వసూళ్లు పెంచుతున్నారు!

Sat 13th Feb 2016 05:37 PM
nani,krishna gaadi veera prema gaadha,usa ticket price  రేట్లు తగ్గించి వసూళ్లు పెంచుతున్నారు!
రేట్లు తగ్గించి వసూళ్లు పెంచుతున్నారు!
Advertisement
Ads by CJ

సినిమాను బట్టి టిక్కెట్ రేట్లు పెంచేయడం, వారం తిరిగేలోగా వీలైనంతగా సొమ్ములు దండుకోవడం అటు తరువాత ఓవరాల్ సినిమా రిజల్టుతో సంబంధం లేకుండా తదుపరి ప్రాజెక్టు గురించి ఆలోచించుకోవడం. ఇదీ నేటి సినిమా వ్యాపార లక్షణం. క్వాలిటీతో ఎటువంటి కనెక్షన్ లేకుండా కేవలం వ్యాపార దృక్పదం మీదే ఇక్కడి లెక్కలు ఆధారపడి ఉన్నాయి. ఈ సోది అంతా దేనికంటే, ఓవర్సీసు సినిమా యాపారం గురించి. బడా హీరో సినిమా పడుతోంది అంటే ప్రీమియర్ షోలతోనే పెట్టుబడిని మొత్తం రాబట్టాలి అనేంత రేంజులో టిక్కెట్ ధరలు ఇష్టారాజ్యానికి 15 నుండి 20 డాలర్ల వరకు లేపేస్తున్నారు. ఇక్కడి నుండి పరాయి దేశం పోయిందే డాలర్ డాలర్ కలేసి ఇండియాకు పంపించి ఏవో ఆస్తులు కూడబెట్టేయడానికి. మరి అలాంటి తెలుగోడి దగ్గరి నుండే డబ్బులు గుంజాలంటే ఎలా అన్న ప్రశ్న ఒక్కోసారి తలెత్తినా సినిమా హిట్టంటే ఫ్యామిలీతో రావడానికి అక్కడి ప్రేక్షకులు కూడా వెనకా ముందు ఏమీ ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తున్నారు. ఎందుకో ఏమో గానీ నానీ నటించిన కృష్ణగాడి వీరప్రేమగాధకు మాత్రం సదరు నిర్మాతలు అండ్ పంపిణీదారులు 12 డాలర్లకే ప్రీమియర్ షో తలుపులు తెరిచేసారు. అలాగే వీక్ డేస్ వచ్చేసరికి కూడా రేట్లు మరింతగా తగ్గించేస్తారన్న న్యూస్ కూడా వినబడుతోంది. భలే భలే మగాడివోయ్ తరువాత హీరో నానికి ఓవర్సీస్ అంతటా ఫ్యామిలీ ఫాలోయింగ్ ఎక్కువైంది. టిక్కెట్ ధర తగ్గించారు, సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది కాబట్టి, ఇక టిక్కెట్లు కట్టలు కట్టలుగా ఫ్యామిలీ ఆడియెన్సుతో తెగుతాయి అన్నది 14 రీల్స్ ప్లాన్ కాబోలు. మూడు రోజులు పోతే ఆ ముచ్చట ఏందో తేలిపోద్ది కదా!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ