Advertisementt

సునీలుకు లైన్ క్లియర్!

Sat 13th Feb 2016 04:53 PM
sunil,krishnashtami  సునీలుకు లైన్ క్లియర్!
సునీలుకు లైన్ క్లియర్!
Advertisement
Ads by CJ

దిల్ రాజు ప్లానింగ్ అదరహో అని అనని వారు ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు. ఎప్పటి నుండో పెద్ద సినిమాల భారి నుండి తన చిన్న సినిమా కృష్ణాష్టమిని కాపాడుకుంటూ వస్తున్న దిల్ రాజు ఎట్టకేలకు వచ్చే వారం 19వ తారీఖున చిత్రాన్ని జనాల ముందు దింపబోతున్నారు. జోష్ ఫేం వాసు వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ హోల్ సేల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అలాగే చిత్ర రన్ టైం కూడా 134 నిమిషాలకు కుందించి వేయడంతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా, శ్రమ లేకుండా, సుతిమెత్తగా హాయిగా సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది అంటున్నారు. సునీల్ సరసన డింపుల్ చోపడే, నిక్కి గాల్రాని హీరోయిన్లుగా నటించారు. అలాగే ఈ ప్రాజెక్టు సునీల్ కెరీరుకు ఎంత కీలకం అయింది. గత కొన్నాళ్ళుగా విజయం అంటే మొహం వాచిపోయి ఉన్న సునీల్, కృష్ణాష్టమి మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. సినిమాలో కంటెంట్ ప్రకారం రిచ్ నెస్ కోసం బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు చేసారు. అన్నీ కలిసొస్తే దిల్ రాజు మారోసారి తన మంత్రజాలాన్ని బాక్సాఫీస్ మీద అబ్రకదబ్ర అని కమ్మించేసి సొమ్ములు కొల్లగొట్టడం ఖాయం.

Tags:   SUNIL, KRISHNASHTAMI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ