సంక్రాంతికి 200కోట్ల బిజినెస్ జరిగితేనే అంతా అబ్బో.. అనుకున్నారు. టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా అమ్మో అనుకున్నాయి. కానీ ఇప్పుడు ఈ మొత్తం ఒక్కసారిగా 500కోట్లకు చేరనుంది. ఈ సమ్మర్ సినీ ప్రియులకు మాజాను, సినిమా బిజినెస్‌లో ఉన్న వారికి కాసుల వర్షాన్ని అందివ్వనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో 'నేను శైలజ, నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, ఎక్స్‌ప్రెస్‌రాజా, సోగ్గాడే చిన్నినాయనా' వంటి సినిమాలు సుమారు 130కోట్ల బిజినెస్ చేశాయి. ఇందులోనూ థియేటర్స్, శాటిలైట్, ఆడియో .. ఇలా అతన్ని హక్కులతో సుమారు 240కోట్ల వరకు ఈ సినిమా వసూళ్లు సాగాయి. ఇప్పుడేమో సమ్మర్‌కు ఓ 30 సినిమాల వరకు రిలీజ్ అవుతున్నాయి. మార్చి 15న 'ఊపిరి'తో మొదలై మే 27 వరకు ఈ సినిమాల పోటీ కొనసాగుతుంది. తెలుగు సినిమాకు సంబంధించి నిజంగానే ఈ సమ్మర్ ఓ ఉత్సవంలా మారేట్లుంది. మరి ఈ క్రేజ్‌ను ఏ సినిమాలు నిలబెట్టుకుంటాయో వేచిచూడాలి...!