వయసు 50కి చేరువ అవుతున్నా అందంలో 20ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తోంది రమ్యకృష్ణ. ఈ లేటు వయసులో నీలాంబరికి ఒక్క ఏడాదిలోపే ఇంతటి క్రేజ్ వచ్చింది. 'బాహుబలి, సోగ్గాడే చిన్నినాయానా' చిత్రాలతో దక్షిణాదిన ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక ఏడాది ముందు వరకు రమ్యకృష్ణ అంటే కేవలం ఓ నిన్నటితరం హీరోయిన్ అని మాత్రమే అందరికీ తెలుసు కానీ ఒకే ఏడాదిలో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. 'బాహుబలి'లో ఎందరో నటీనటులు ఉన్నప్పటికీ శివగామిగా రమ్యకృష్ణ నటనే అందరినీ ఆకట్టుకొంది. ఇక 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో కుర్ర హీరోయిన్ లావణ్యత్రిపాఠి ఉన్నప్పటికీ ప్రేక్షకుల దృష్టి మాత్రం మొత్తం రమ్యకృష్ణ మీదనే. నటనతోనే కాదు.. తన అందంతో కూడా ఆమె ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. యంగ్ స్టార్ హీరోయిన్లు కూడా ఆమెను చూసి బెదిరిపోతున్నారు, నటన, అందంలోనే కాదు.... రెమ్యూనరేషన్‌పరంగా కూడా రమ్యకృష్ణ అరుదైన ఫీట్‌ను సాధిస్తోంది. ఎవరో కొందరు స్టార్ హీరోయిన్లకే సాధ్యమైన 'కోటి'ఫీట్‌ను రమ్యకృష్ణ సాధించింది. త్వరలో తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో అనుష్క, సమంతలు ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం 'రుద్రాక్ష'. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలకపాత్ర పోషించనుంది. ఈ చిత్రానికి గాను ఆమె కోటిరూపాయల పారితోషికం తీసుకుంటోంది. ఇలా ఆమె ఇప్పుడు కోటి తారగా మారింది. అలాగే ఆమె 'బాహుబలి2'కి కూడా భారీ పారితోషికం తీసుకుందని సమాచారం. మరి దక్షిణాదిలో ఎవరైనా ఓ పవర్‌ఫుల్ మిడిల్ ఏజ్ పాత్ర ఉంటే వారికి రమ్యకృష్ణనే మొదటి ఆప్షన్‌గా నిలుస్తోంది.