Advertisementt

పవన్‌ చేసిన తప్పు చేయడట..!

Fri 12th Feb 2016 06:45 PM
pawan kalyan,gopala gopala,sudeep,mukunda murari  పవన్‌ చేసిన తప్పు చేయడట..!
పవన్‌ చేసిన తప్పు చేయడట..!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌ అభిమానులుగా అభిమానించి అనుసరించేవారు ఉండటం చూశాం. ఇప్పుడు 'ఈగ' విలన్‌.. కన్నడ స్టార్‌ సుదీప్‌ కెరీర్‌ పరంగా కూడా పవన్‌ కెరీర్‌ గ్రాఫ్‌ను ఫాలో అవుతున్నాడు. రీసెంట్‌గా ఆయన కన్నడంలో పవన్‌ చిత్రం 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని రీమేక్‌ చేసిన సుదీప్‌ మరో పవన్‌ రీమేక్‌పైనే దృష్టి పెట్టాడు.బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'ఓ మైగాడ్‌' కు రీమేక్‌గా రూపొందిన 'గోపాల గోపాల' చిత్రాన్ని కన్నడంలో రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ట్విస్ట్‌ ఏమిటంటే.. పవన్‌ తెలుగులో చేసిన కృష్ణుడు పాత్రను కన్నడంలో సుదీప్‌ పోషించడం లేదు. వెంకటేష్‌ చేసిన గోపాలరావు పాత్రను పోషించనున్నాడు. 'ముకుందర మురారి' అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. లో బడ్జెట్‌లో ఈ చిత్రాన్నితీయాలని సుదీప్‌ భావిస్తున్నాడు. తెలుగులో 'గోపాల గోపాల' చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. పవన్‌ సినిమా అనుకొని థియేటర్‌కు వెళ్లిన అభిమానులకు ఆయన గెస్ట్‌రోల్‌లో కనిపించినటైంది. దాంతో ఫ్యాన్స్‌ కూడా నిరాశ చెందారు. అలాంటి పొరపాటు కన్నడలో జరగకుండా సుదీప్‌ ముందుజాగ్రత్తగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ