Advertisementt

ర‌వితేజ ఛాన్స్ ఇచ్చాడు కానీ..!

Fri 12th Feb 2016 05:22 PM
raviteja,venu sriram,damodar prasad,d.v.v.danayya  ర‌వితేజ ఛాన్స్ ఇచ్చాడు కానీ..!
ర‌వితేజ ఛాన్స్ ఇచ్చాడు కానీ..!
Advertisement
Ads by CJ

మాస్‌లో య‌మా క్రేజ్ ఉన్న ఓ క‌థానాయ‌కుడు ర‌వితేజ‌. ఆయ‌న కాల్షీట్ల కోసం చాలా మంది నిర్మాత‌లు ఎదురు చూస్తుంటారు.  ఒక‌ప్పుడు యేడాదికి నాలుగైదు సినిమాలు చేసిన ఆయ‌న ఇటీవ‌ల ఒక‌ట్రెండు సినిమాల‌తోనే స‌రిపెట్టుకొంటున్నాడు. అందుకే ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుకొనే నిర్మాతల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. అలాంటి ప‌రిస్థితుల్లో  ఓ నిర్మాత‌కి అనూహ్యంగా ర‌వితేజ‌తో సినిమా చేసే అవ‌కాశం దొరికింది. చెప్పాలంటే అదొక గోల్డెన్ ఛాన్స్. కానీ ఆ అవ‌కాశాన్ని సదరు నిర్మాత  వృథా చేసుకొన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మ‌రో నిర్మాత ముందుకొచ్చి ర‌వితేజ‌తో ప్రాజెక్టుని ప‌ట్టాలెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. అందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళితే... 

ర‌వితేజ బెంగాట్ టైగ‌ర్ త‌ర్వాత దిల్‌రాజుతో సినిమా చేయాల్సింది. వేణు శ్రీరామ్ అనే ద‌ర్శ‌కుడితో దిల్‌రాజు క‌థ కూడా సిద్ధం చేయించాడు. కానీ రెమ్యున‌రేష‌న్ ద‌గ్గ‌ర రాజుకీ, రవితేజ‌కీ భేదాభిప్రాయాలు వ‌చ్చాయ‌ట‌. దీంతో ర‌వితేజ ఆ ప్రాజెక్టు నుంచి బ‌య‌టికొచ్చేశాడ‌ట‌. ఇంత‌లో చ‌క్రి అనే ఓ కొత్త ద‌ర్శ‌కుడు త‌యారు చేసిన క‌థని ర‌వితేజ ఓకే చేసి ఆ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాన్ని నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌కి ఇచ్చాడ‌ట‌. స్టార్ హీరో పిలిచి అవ‌కాశం ఇచ్చాడంటే ఇక అంతకంటే ఏం కావాలి? కానీ కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ ఇప్పుడు త‌న కొత్త చిత్రం క‌ళ్యాణ వైభోగ‌మేని విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఈ ద‌శ‌లో ర‌వితేజ‌లాంటి స్టార్ క‌థానాయ‌కుడితో ప్రాజెక్టు అంటే ఆ బ‌రువు మోయ‌డం క‌ష్ట‌మ‌న్న అభిప్రాయంతో ఆయ‌న మ‌రో నిర్మాత‌కి ఆ అవ‌కాశాన్ని వదులుకొన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడు దామోద‌ర్ ప్ర‌సాద్ ప్లేస్‌లో డీవీవీ దాన‌య్య వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. రాబిన్ హుడ్ పేరుతొ తెరకెక్కనున్న ఆ  చిత్రంలో రవితేజ సరసన రాశి ఖన్నా నటించబోతున్నట్టు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ