Advertisementt

రాజమౌళితో తలపడుతున్న అమీర్‌..!

Fri 12th Feb 2016 02:26 PM
rajamouli,bahubali2,amirkhan,dangal movie,december 25th release  రాజమౌళితో తలపడుతున్న అమీర్‌..!
రాజమౌళితో తలపడుతున్న అమీర్‌..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు బాలీవుడ్‌ మీడియాలో ఒకటే వార్త హల్‌చల్‌ చేస్తోంది. అమీర్‌ఖాన్‌తో రాజమౌళి డైరెక్ట్‌ బాలీవుడ్‌ మూవీ చేయనున్నాడనేది ఆ వార్త. అయితే ఇప్పటివరకు అది పైనల్‌ కాలేదు. అదే సమయంలో ఇప్పుడు మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి రాజమౌళి 'బాహుబలి-ది బిగినింగ్‌' చిత్రం డబ్బింగ్‌ వెర్షన్‌ సైతం బాలీవుడ్‌లో రికార్డులు తిరగరాసింది. బాలీవుడ్‌ సమాచారం ప్రకారం ఈసారి అంటే 2016 క్రిస్మస్‌ సీజన్‌లో 'బాహుబలి2' విడుదల కానుందని, అదే సమయంలో అమీర్‌ఖాన్‌ తాజా చిత్రం 'దంగల్‌' కూడా విడుదలకు సమాయత్తం అవుతుందని సమాచారం. వాస్తవానికి బాలీవుడ్‌లో సినిమా ప్రారంభానికి ముందే చిత్రం విడుదల తేదీని అనౌన్స్‌ చేయడం ఆనవాయితీ. అదే విధంగా 'దంగల్‌' టీం కూడా ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా అదేరోజున అంటే డిసెంబర్‌ 25న 'దంగల్‌'ను విడుదల చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో 'బాహుబలి2'ని కూడా అదేరోజున అంటే డిసెంబర్‌ 25న విడుదల చేయాలని రాజమౌళితో పాటు కరణ్‌జోహార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. మరి బాలీవుడ్‌లో ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలైతే పరిస్థితి ఏమిటి? ఏ సినిమాకు ఇది ప్లస్‌ అవుతుంది? ఏ సినిమాకు ఇది మైనస్‌ అవుతుంది? అనేది ఇప్పుడు బాలీవుడ్‌లో హట్‌టాపిక్‌గా మారింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ