చాలా చిన్న వయసులోనే హీరోయిన్లుగా బిజీ అవుతుండటంతో పలువురు భామల చదువు మాత్రం సంతకెళ్లుతోంది. సినిమాలతో బిజీ కావడంతో వారు చదువులకు స్వస్తి చెబుతున్నారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం'తో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన మాళవికనాయర్ తన చదువుకు మధ్యలోనే ముగింపు పలికింది. ఇక 'లోఫర్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన 'దిశాపటాని' మొదటి సినిమా పూర్తయ్యేవరకు చదువును కొనసాగించినప్పటికీ సినిమాలలో బిజీ కావడం వల్ల తన బిటెక్ చదువుకు గుడ్‌బై చెప్పింది. ఇక అనుపమ పరమేశ్వరన్, అవికాగోర్.. వంటి ఎందరో హీరోయిన్లు చిన్నతనంలోనే నటనలోకి రావడంతో వారు చదువుకు గుడ్‌బై చెబుతున్నారు. సాధారణంగా హీరోయిన్లకు 16 ఏళ్ల నుండి 18ఏళ్ల లోపలే మంచి అవకాశాలు వస్తుంటాయి. దీంతో వారు చదువులను పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అయితే వారి కెరీర్ కేవలం మూడు నాలుగేళ్లలోపే ఉంటుంది. ఆ తర్వాత అవకాశాలు వాటంతట అవే తగ్గిపోతాయి. అప్పుడు చదువుదామనుకున్నా చదవలేరు. దీంతో వీరు రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతున్నారు.