భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్యం పరంగా సత్సంబంధాలు లేకపోయినా ఇండియన్ సినిమాలంటే అక్కడ ఎగబడి చూస్తుంటారు. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ ఇక్కడే కాదు అక్కడా స్టార్ హీరోలే. మొన్న విడుదలయిన భజరంగీ భాయిజాన్ పాకిస్తాన్ బాక్సాఫీసును ఊపేసింది. అంతలా బాలివుడ్ చిత్రాలని ఇష్టపడే ప్రేక్షకులున్నప్పుడు అన్ని పెద్ద హిందీ చిత్రాలు అక్కడ కూడా రిలీజ్ చేయోచ్చు కదా అంటారా? ఇదిగో నీరజా అనే హీరోయిన్ ప్రాధాన్య చిత్రం సంగతే చూడండి. సోనం కపూర్ హీరోయినుగా రామ్ మాద్వాని నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ మూవీని పాకిస్తాన్ బ్యాన్ చేసి పారేసింది. 1986లో PAN AM 73 విమానాన్ని కరాచిలో హైజాక్ చేసిన ఉదంతాన్ని ప్రేరణగా తీసుకుని, అప్పటి వాతావరణాన్ని రీ-క్రియేట్ చేసిన ఈ చిత్రం యావత్ ప్రపంచంలో వచ్చే వారం విడుదలవుతుంటే పాకిస్తాన్లో మాత్రం నోచుకోలేదు. పాకిస్తాన్ కామర్స్ మినిస్ట్రీ ముందుగా రిలీజుకి ఒప్పుకున్నా అటు తరువాత నీరజా చిత్రంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా సంభాషణలు ఉన్నాయని తెలుసుకుని మొత్తంగా బ్యాన్ జెండా ఎగరేసింది.