Advertisementt

చరణ్‌ కోసం సుక్కు స్టోరీ రెడీ..!

Thu 11th Feb 2016 02:27 PM
ram charan,sukumar,thani oruvan,nannaku prematho  చరణ్‌ కోసం సుక్కు స్టోరీ రెడీ..!
చరణ్‌ కోసం సుక్కు స్టోరీ రెడీ..!
Advertisement
Ads by CJ

'నాన్నకు ప్రేమతో' తర్వాత జీనియస్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తాను దేవిశ్రీప్రసాద్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రం, ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ఓ చిత్రం... వీటన్నింటి తర్వాత బన్నీతో ఓ చిత్రం చేయనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా దేవిశ్రీప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తూ చేయాల్సిన సినిమాకు ఇంకా చాలా టైమ్‌ ఉండటంతో ఆయన చరణ్‌తో చేయబోయే చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్‌ను తయారుచేయడంలో బిజీగా మారాడు. ఎట్టకేలకు ఓ మంచి రొమాంటిక్‌ థ్రిల్లర్‌ స్టోరీని తయారుచేసిన సుకుమార్‌ ఈ స్టోరీని ఇటీవలే రామ్‌చరణ్‌కు కూడా వినిపించి ఓకే చేయించుకున్నాడని సమాచారం. రామ్‌చరణ్‌ సురేందర్‌రెడ్ది దర్శకత్వంలో చేయబోయే 'తని ఒరువన్‌' రీమేక్‌ తర్వాత చరణ్‌ చేయబోయే చిత్రం ఇదేనని సమాచారం. మొత్తానికి సుక్కు మాత్రం రామ్‌చరణ్‌కు మంచి క్లాస్‌ ఇమేజ్‌ వచ్చేలా స్టోరీలైన్‌ను తయారుచేసి, దానికి పక్కా స్క్రిప్ట్‌ను రెడీ చేసేపనిలో తలమునకలై ఉన్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ