Advertisementt

ఆమె మాయ చేస్తోంది..!

Thu 11th Feb 2016 11:51 AM
rashikhanna,raviteja,oxygen,robinhud,ranjith movies  ఆమె మాయ చేస్తోంది..!
ఆమె మాయ చేస్తోంది..!
Advertisement
Ads by CJ

ఒక సినిమాలో జంటగా చేసిన హీరోహీరోయిన్లు మరో సినిమాలో కంటిన్యూ అవ్వాలంటే వారి మధ్య మంచి ర్యాపో ఉండాలి. ముఖ్యంగా హీరోలు తమ పక్కన ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్‌తో చేయాలని కోరుకుంటుంటారు. ఒకసారి చేసిన వారిని రిపీట్‌ చేయడానికి ఆసక్తి చూపించరు. కానీ అదేంటో రాశిఖన్నా మాత్రం ఒక్కసారి ఆమెతో చేస్తే ఆ హీరోలు తమ తదుపరి ప్రాజెక్ట్‌లో ఆమెనే కావాలంటున్నారు. 'జిల్‌' లో గోపీచంద్‌తో చేసిన ఆమెను తన తదుపరి చిత్రం 'ఆక్సిజన్‌'లో తీసుకున్నాడు గోపీచంద్‌. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఇక 'బెంగాల్‌టైగర్‌'లో తమన్నా కంటే ఎక్కువగా ఆకట్టుకుంది రాశిఖన్నా. ఇప్పుడు రవితేజ, రాశిఖన్నా ఇద్దరు మరోసారి తెరపై సందడి చేయబోతున్నారు. రవితేజ హీరోగా రంజిత్‌మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దామోదరప్రసాద్‌ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం ద్వారా చక్రి అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి 'రాబిన్‌హుడ్‌' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. మార్చి నుండి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇలా రాశిఖన్నా తనతో నటించిన హీరోలను మాయ చేస్తోందని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ