Advertisementt

బోయపాటితో సినిమా ఉంటుందా..?

Thu 11th Feb 2016 11:06 AM
boyapati srinu,alludu drinu,sai srinivas,speedunnodu  బోయపాటితో సినిమా ఉంటుందా..?
బోయపాటితో సినిమా ఉంటుందా..?
Advertisement
Ads by CJ

'అల్లుడుశీను' చిత్రంతో వినాయక్‌ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ ఈ చిత్రం పెద్దగా కమర్షియల్‌గా వర్కౌట్‌ కాకపోయినా హీరోగా సక్సెస్‌ అయ్యాడనే అందరూ భావించారు. ఆ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్‌ నటించిన తమిళ 'సుందరపాండ్యన్‌' రీమేక్‌ను 'స్పీడున్నోడు' పేరుతో భీమనేని శ్రీనివాసరావు దర్శకనిర్మాణంలో తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం ఇటీవలే విడుదలై మార్నింగ్‌ షోకే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌ దాదాపు 20కోట్లు చేసిందని, కానీ ఇప్పుడు అందులో సగం రావడం కూడా కష్టమే అంటున్నారు. దాంతో డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలు తప్పవని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాస్తవానికి 'అల్లుడుశీను' తర్వాత బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించాల్సివుంది. కానీ ఎందుకోకానీ ఈ చిత్రం ఆగిపోయింది. దాంతో ఆ స్థానంలో బోయపాటి శ్రీను బన్నీతో 'సరైనోడు' తీస్తే... సాయిశ్రీనివాస్‌ 'స్పీడున్నోడు' చేశాడు. కాగా సాయి శ్రీనివాస్‌ నటించే తదుపరి చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డ్యాన్స్‌లు, ఫైట్స్‌పరంగా సాయిశ్రీనివాస్‌ మంచి మార్కులే వేయించుకుంటున్నప్పటికీ డైలాగ్‌ డెలివరి, ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో అతనిలో టాలెంట్‌ కనిపించడం లేదు. దాంతో బోయపాటి సాయిశ్రీనివాస్‌తో సినిమా చేస్తాడా? లేదా? అన్నది ఆసక్తిని కలిగిస్తోంది. బోయపాటి బాలయ్య చిత్రానికి స్క్రిప్ట్‌ వర్క్‌ చేసే పనిలో నిమగ్నమవుతాడా? లేక బెల్లంకొండ సురేష్‌ ఇస్తానన్న రెమ్యూనరేషన్‌ కోసం సాయిశ్రీనివాస్‌తోనే సినిమా చేస్తాడా? అనేది తేలాల్సివుంది. వాస్తవానికి బోయపాటి శ్రీను రెమ్యూనరేషన్‌ 9కోట్లు ఉండగా, బోయపాటికి బెల్లకొండ సింగిల్‌ పేమెంట్‌లో 12కోట్లు ఇస్తానని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ