ఆడదాని డ్రెస్సింగ్ సెన్స్ కాదు, మగవాడి కళ్ళలో చూసే సెన్స్ మారాలి అని బాలకృష్ణ గారు ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా పెళ్లి చేసుకొని భార్యగా మసులుతూ, ఇంట్లో పిల్లలకి తల్లిగా ఉంటూ ఈ బరితెగింపు స్కిన్ షో ఏంటని జబర్దస్త్ అనసూయని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేస్తూనే ఉంటారు. ఒక్కోసారి ఈ కామెంట్స్ మితిమీరి బూతుల రూపంలోకి కూడా వెళ్తుంటాయి. చాలా వరకు నెమ్మదిగా అందరికీ శాంతంగా సమాధానం ఇచ్చే అనసూయకి ఈసారి బాగా మండింది. అందుకే అసహనంగా అలాంటి వారందరికీ కలిపి ఒకేసారి గడ్డి పెట్టింది. మీ జీవితాలు చక్కదిద్దుకోకుండా అవతలి వాళ్ల జీవితాల మీద పడి ఏడవడం దేనికని, ఆ సమయాన్ని ఎవరి కోసం వాళ్ళు వెచ్చిస్తే జీవితంలో విజయం సాధిస్తారని, అయినా తాను ప్రొఫెషన్ ప్రకారమే మసులుకుంటానని, అలా తనని అర్ధం చేసుకునే భర్త దొరకడం అదృష్టం అని, నేను కానీ నా పద్ధతి కానీ నచ్చకపోతే పక్కన పడేయండి తప్ప అనవసరమైన ఆరోపణలు చేయడం తప్పని, అలాంటి కామెంట్స్ చేసేవాళ్లని తల్లితండ్రులు సరిగా పెంచలేదన్న సంగతి అర్థమవుతుందని వాయించి పారేసింది. దీనికి కూడా తుంటరి కుర్రాళ్ళు రెస్పాండ్ కాకుండా ఉంటారా... అనసూయ తన పని ఆపకుండా ఉంటుందా?