Advertisementt

బాగుందయ్యా అఖిల్!

Wed 10th Feb 2016 01:59 PM
akhil,khammam,auto  బాగుందయ్యా అఖిల్!
బాగుందయ్యా అఖిల్!
Advertisement
Ads by CJ

అభిమానులను కలుసుకొని వారితో మనసు విప్పి మాట్లాడాలన్న తపన ప్రతి స్టార్ హీరోకి ఉన్నా ఒక్కోసారి వారికి అది వీలుపడక పోవచ్చు. అదే ఎవరైనా అభిమాని ప్రాణాపాయ పరిస్తుతుల్లో ఉన్నాడన్న విషయం తెలిస్తే మాత్రం మన హీరోలు చలించిపోతారు. వార్త తెలిసిన వెంటనే రెక్కలు కట్టుకొని వారి ఎదురుగా వాలిపోయి కుశల సమాచారాలు అడిగి తెలుసుకుంటారు. ఇదిగో అలాంటి సంఘటనే అక్కినేని అఖిల్ విషయంలో జరిగింది. ఖమ్మంలో నివసిస్తున్న అశ్విత్ రెడ్డి అనే అఖిల్ అభిమాని మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆర్థికంగా మెరుగైన చికిత్స చేయించుకొనే స్తోమత కూడా లేకపోవడంతో అఖిల్ స్వయంగా రంగంలోకి దిగి, ఖమ్మంలో ప్యాసెంజర్ ఆటో నడిపి తద్వారా వచ్చిన కిరాయి డబ్బులని అశ్వింత్ రెడ్డికి వ్యక్తిగతంగా కలిసి అందజేశాడు. మరి ఆటో ఫీటుతో ఎంత సొమ్ము జమయ్యింది తెలీదు గానీ, అఖిల్ అలా రోడ్డు మీద ఆటోలో కనపడడంతో జనం మాత్రం బాగానే పోగయ్యారు. తన ఇష్టమైన హీరోని చూసిన ఆనందంలో అశ్విత్ రెడ్డి కూడా ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇంకొందరు మాత్రం అదేంటి అఖిల్ దగ్గర డబ్బులకు కొదవా, ఇలా ఆటో ఎందుకు నడిపాడో అని అమాయకంగా అనుమానం వెలిబుచ్చారు!

Tags:   AKHIL, KHAMMAM, AUTO
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ