Advertisementt

ఇక్కడ ఫ్లాప్‌...అక్కడ హిట్‌..!

Wed 10th Feb 2016 01:36 PM
krithisanon,one nenokkadine,mahesh babu,yami gautham  ఇక్కడ ఫ్లాప్‌...అక్కడ హిట్‌..!
ఇక్కడ ఫ్లాప్‌...అక్కడ హిట్‌..!
Advertisement
Ads by CJ

నేటితరం పరభాషా హీరోయిన్ల విషయానికి వస్తే.. వారికి తెలుగులో చుక్కెదురవుతున్నప్పటికీ బాలీవుడ్‌ మాత్రం రా..రమ్మని వారిని ఆహ్వానిస్తోంది. తెలుగులో సరైన సత్తా చూపించలేకపోయిన యామీగౌతమి విషయాన్నే తీసుకుంటే ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె పేరు ఇక్కడ వినపడలేదు. తాజాగా ఆమెకు బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్‌ హీరోగా ఆయన తండ్రి రాకేష్‌రోషన్‌ దర్శకత్వంలో రూపొందనున్న 'కాబిల్‌' చిత్రంలో హీరోయిన్‌ అవకాశం వచ్చింది. ఇక తెలుగులో నాగచైతన్య, వరుణ్‌తేజ్‌ వంటి హీరోల సరసన నటించినప్పటికీ కన్నడ భామ పూజాహెడ్గేకు సరైన అవకాశాలు రావడం లేదు. ఆమె ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందుతున్న 'మొహంజదారో' చిత్రంలో హీరోయిన్‌ అవకాశం వచ్చింది. ఇక మహేష్‌బాబు చిత్రం '1' (నేనొక్కడినే), నాగచైతన్య 'దోచెయ్‌' చిత్రాలతో పరాజయాల బాట పట్టి ఐరన్‌లెగ్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న కృతిసనన్‌కు ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. సల్మాన్‌ఖాన్‌ తదుపరి చిత్రంలో కృతిసనన్‌ హీరోయిన్‌గా నటించనుంది. మొత్తానికి ఈ మాయా ప్రపంచంలో ఎవరి ఎప్పుడు ఎక్కడ అవకాశాలు వస్తాయో? లేక ఎక్కడ ఎప్పుడు చతికిల పడతారో చెప్పలేమనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ