Advertisementt

అంతా నీ చుట్టే తిరగాలా రామ్ చరణ్?

Tue 09th Feb 2016 06:16 PM
ramcharan,thani oruvan remake  అంతా నీ చుట్టే తిరగాలా రామ్ చరణ్?
అంతా నీ చుట్టే తిరగాలా రామ్ చరణ్?
Advertisement
Ads by CJ

తని ఒరువన్ తమిళ చిత్రం తెలుగు రీమేక్ అనగానే కథానాయకుడి కన్నా ప్రతినాయకుడి పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యతను మన తెలుగులో ఎలా ఇస్తారో చూడాలి అని విశ్లేషకులు చెవులు కొరికేసుకున్నారు. తమిళ మాతృకలో అరవింద్ స్వామీ స్టైల్, సోబర్ లుక్కుతో విలనీయం కొత్త పుంతలు తొక్కింది. హీరోగా జయం రవి తనదైన శైలిలో మెప్పించినా స్క్రిప్టులో ఉండే చురుకుదనం, వేగం సినిమాను కొత్త లెవెల్ చేర్చాయి. మెడికల్ మాఫియా మీద రాసుకున్న ఈ కథ టెక్నికలుగా కొత్తగా అనిపించింది కాబట్టే ఓవరాలుగా సూపర్ హిట్టయింది. సురేందర్ రెడ్డి చేతిలో కథ, కథనం మొత్తం పెట్టేసి విలన్ మీద ఫోకస్ తగ్గించి హీరో మీద ఎక్కువ దృష్టి కేంద్రీకృతం అయ్యేలా మార్పులు చేర్పులు చేయమంటే తని ఒరువన్ అసలు కథలోని బిగిని సడలించినట్టే. హీరో ఎలివేషన్ ఎప్పుడు  ఎక్కువవుతుంది అంటే విలన్ గట్టివాడు అయినప్పుడే. మెడికల్ మాఫియా కథలో విలన్ అంటే అరవింద్ స్వామీ లాగానే డీసెంటుగా ఉండి క్రూరత్వం పలికించాలి. అందుకే అతని పాత్రలో కొత్త షేడ్ అగుపిస్తుంది. పాపం హీరోకి విలన్ ఒక్కడే టార్గెట్ కాబట్టి ఓన్లీ సింగిల్ షేడ్ అండ్ సింగిల్ ఎక్స్ ప్రెషన్. సో, హీరో చుట్టూరే తిరిగే స్టోరీ కావాలనుకుంటే మాత్రం రామ్ చరణ్ నిజంగా తని ఒరువన్ మరిచిపోవచ్చు!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ