Advertisementt

అల్లు అరవింద్ మెగా స్కెచ్!

Tue 09th Feb 2016 05:49 PM
allu aravind,geetha arts  అల్లు అరవింద్ మెగా స్కెచ్!
అల్లు అరవింద్ మెగా స్కెచ్!
Advertisement
Ads by CJ

 

కొన్ని నెలలుగా బిగ్ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న గీతా ఆర్ట్స్ సంస్థ మళ్ళీ మెగా హీరోల బడా ప్రాజెక్టులతో కళకళలాడబోతోంది. అల్లు అరవింద్ గారి వ్యాపార లక్షణాల గూర్చి కొత్తగా మనం  చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కథ, కథనం అన్నీపకడ్బందీగా ఉంటె తప్ప సినిమా సెట్స్ మీదకి వెళ్ళేది ఉండదు, అప్పటిదాకా పైసా పెట్టుబడి కూడా రాదు. మారుతున్న సినిమా వ్యాపార ఉపమానాలను బట్టి  గీతా ఆర్ట్స్ ఆఫీసులో మళ్ళీ చలనం మొదలయింది. మొదటగా అల్లు అర్జున్ సరైనోడు చిత్రం శరవేగంగా ఏప్రిల్ నెలలో రావడానికి సిద్ధమవుతుంటే, ఈ నెలలోనే రామ్ చరణ్ హీరోగా తని ఒరువన్ రీమేక్ సెట్స్ మీదకి చేరే అవకాశాలున్నాయి. మరో వైపు అల్లు శిరీష్ హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కూడా వేసవిలో సందడి చేయనుంది. అటు తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా ఒక చిత్రం, రామ్ చరణ్ హీరోగా మరో చిత్రం కూడా అల్లు అరవింద్ గారు ప్లాన్ చేస్తున్నారు. GA సంగతులు ఇలా ఉంటె, బన్నీ వాసు నేతృత్వంలో GA 2 మీద తక్కువ బడ్జెట్ కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలకు కూడా ముహూర్తాలు కుదురుతున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ