Advertisementt

పోయే పోయే లవ్వే పోయే...

Tue 09th Feb 2016 05:32 PM
anushka sharma,virat kohli  పోయే పోయే లవ్వే పోయే...
పోయే పోయే లవ్వే పోయే...
Advertisement
Ads by CJ

గ్లామర్ ఇండస్ట్రీలో లవ్వుకు కొవ్వుకు పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మొదలయ్యే ఏ ఒక్క ప్రేమకథకు పెళ్ళితో శుభం కార్డు పడుతుందన్న గ్యారంటీ లేదు. ఈరోజు ప్రేమికులలాగా విహరించిన ప్రేమ పక్షులు రేపు వేరు వేరు గూటికి చేరిన సందర్భాలు చానా ఎక్కువ. క్రికెట్ ఫీల్డులో బౌలర్లకు చుక్కలు చూపించే విరాట్ కోహ్లీ, తెర మీద కనిపించిందంటే అబ్బాయిల మనసుతో కబాడీ ఆడేసుకునే అనుష్క  శర్మలు గత కొన్ని నెలలుగా నిన్ను విడిచి నేను ఉండలేనులే అన్న రేంజులో ఇష్క్ కొనసాగించారు. విరాట్ ఏ దేశంలో మ్యాచ్ ఆడితే అక్కడికి చేరి మనాడి ఏకాగ్రతను భంగం వేసేది ముద్దుగుమ్మ. ఏమైందో తెలీదు గానీ ఓ నెల రోజుల నుండి వీరిద్దరూ విడిపోయారు అన్న పుకారు షికారు చేయడమే కాకుండా అది అక్షర సత్యమని ఇప్పుడు రుజవయింది. ట్విట్టర్లో ఒకరినొకరు అన్-ఫాలో అవడమూ, విరాట్ ఒక్కడే పార్టీలకు హాజరవుతూ ఉండడం, కనీసం అనుష్క పేరు ఎత్తినా చిరాకు పడిపోవడం, అన్నీ చూస్తుంటే వీరి మధ్య చెడింది అని అర్థమయింది. లవ్వు పోయినప్పటి నుండే విరాట్ మళ్ళీ సుప్పర్బ్ ఫాంలోకి వచ్చేసి మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన T20లో కంగారూ బౌలర్ల దుమ్ము రేపాడు.