Advertisementt

క్రేజ్‌కు కొత్త అర్థం చెబుతోన్న శృతి..!

Tue 09th Feb 2016 01:36 PM
sruthihassan,remuneration,premam,majnu movies  క్రేజ్‌కు కొత్త అర్థం చెబుతోన్న శృతి..!
క్రేజ్‌కు కొత్త అర్థం చెబుతోన్న శృతి..!
Advertisement
Ads by CJ

సాధారణంగా నేటితరం హీరోయిన్లు గ్లామర్‌, రెమ్యూనరేషన్‌కు తప్ప మరి దేనికీ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ కమల్‌ గారాల కూతురు శృతిహాసన్‌ మాత్రం వీరికి భిన్నమైన దారిలో వెలుతోంది. తనని తాను నిరూపించుకోవడానికి చాలెంజింగ్‌ రోల్స్‌ రావాలని ఆశపడుతోంది. డబ్బు ముఖ్యంగా కాదంటున్న ఈమె కథ నచ్చితే రెమ్యూనరేషన్‌ విషయం పెద్దగా పట్టించుకోను అంటోంది. క్రేజ్‌ అంటే డబ్బులు సంపాదించాలని, రెమ్యూనరేషన్‌ పెంచాలని కాదు.. క్రేజ్‌ అంటే మంచి మంచి కథలను ఎంచుకునే అవకాశం రావడమే అని కొత్త అర్థం చెబుతోంది. భిన్నమైన పాత్రలు తన వద్దకు రావడమే తనకు క్రేజ్‌ ఉండటానికి ఉదాహరణ అని చెబుతోంది. అలాంటి భిన్నమైన చాలెంజింగ్‌ రోల్స్‌ తనకు వస్తే రెమ్యూనరేషన్‌ను అసలు పట్టించుకోనని, రెమ్యూనరేషన్‌ గురించి పట్టుపడితే మంచి మంచి కథలు కోల్పోవాల్సివస్తుందని ఆమె అంటోంది. ఇలా గ్లామర్‌, యాక్టింగ్‌ రెండింటి మధ్య సమతూకం పాటిస్తూ ఆమె ముందుకు దూసుకెళ్లుతోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న మలయాళ 'ప్రేమమ్‌' రీమేక్‌ 'మజ్ను'లో డీగ్లామర్‌ పాత్రను పోషిస్తుండటం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ