Advertisementt

ధనుష్‌కు ప్రశంసల వెల్లువ..!

Tue 09th Feb 2016 12:45 AM
dhanush,visharanai movie,rajinikanth,vettimaran  ధనుష్‌కు ప్రశంసల వెల్లువ..!
ధనుష్‌కు ప్రశంసల వెల్లువ..!
Advertisement
Ads by CJ

ధనుష్‌ సహనిర్మాతగా దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మించి, తెరకెక్కించిన 'విశారణై'కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని రజనీకాంత్‌ కూడా అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తమిళంలో ట్వీట్‌ చేశాడు. 'విశారణై' లాంటి సినిమాను తమిళ సినిమాలో ఇప్పటివరకు నేను చూడలేదు. అంతర్జాతీయ సినిమాల సరసన ఈ చిత్రం నిలుస్తుంది. వెట్రిమారన్‌, ధనుష్‌కు శుభాకాంక్షలు... అంటూ రజనీ ట్వీట్‌ చేశాడు. కమల్‌హాసన్‌ కూడా ఈ సినిమాని చూసి అభినందించారు. 'విశారణై' చిత్రంలో దినేష్‌, సముద్రగని, కిషోర్‌, అజయ్‌ఘోష్‌లు ప్రధానపాత్రలు పోషించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు అందుకొంది. ధనుష్‌ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా డిఫరెంట్‌ చిత్రాలు నిర్మిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ