Advertisementt

అమ్మ నానీ, ఇంత భారీగానా?

Mon 08th Feb 2016 04:33 PM
nani,krishnagadi veera prema gadha release  అమ్మ నానీ, ఇంత భారీగానా?
అమ్మ నానీ, ఇంత భారీగానా?
Advertisement
Ads by CJ

ఒక్క సినిమా చాలు, రాత్రికి రాత్రే తలరాతలు మారిపోతాయి మన సినిమా ఇండస్ట్రీలో. అప్పటివరకు నానీ అంటే అబ్బే ఫ్లాప్ హీరో అని తలలు పట్టుకున్న నిర్మాతలు, బయ్యర్లు ఒక్క భలే భలే మగాడివోయ్ చిత్రంతో అతడికి న్యాచురల్ స్టార్ అని నామకరం చేసేసి సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టారు. అందుకే రేపు రానున్న కృష్ణగాడి వీరప్రేమ గాధకు వీర లెవెల్లో ఓపెనింగ్స్ పిండుకునే ప్రణాళికను సిద్ధం చేసారు 14 రీల్స్ నిర్మాణ సంస్థ యాజమాన్యం. 15 కోట్లకు పైగానే థియేట్రికల్ వ్యాపారం జరగడం చూస్తుంటే సినిమా పట్ల అలుముకున్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవ్వాలి. వీటన్నింటినీ క్యాష్ చేసుకునే పనిలో భాగంగా ఓవర్సీసులో వందకు పైగా స్క్రీన్స్ మీద, డొమెస్టిక్ మార్కెట్ మొత్తం కలిపి 800కు పైగా తెరల మీద కృష్ణగాడి వీరగాధను తిలకించడానికి వదులుతున్నారు. ఇది నిజంగా నాని సత్తాకి భారీ సంఖ్యే అయినా, ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చేసిందంటే మరోసారి భలే భలేని మించిపోయే నంబర్లు నమోదవడం ఖాయం. నానీకి ఇది అగ్నిపరీక్షే బట్ సినిమా పట్ల యూనిట్ మరియు మార్కెట్ మొత్తం పాజిటివ్ అభిప్రాయంతో ఉండడం అన్నింటిలో అతిపెద్ద ఊరట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ