ముకుందతో ముందు ముందు నేనేంటో చూపిస్తానని మాటిచ్చిన వరుణ్ తేజ్ అందరూ అనుకున్నట్లుగా మెగా మాస్ ఇమేజికి బదులుగా కంచె, లోఫర్ లాంటి విభిన్నమైన చిత్రాలతో వర్సటైల్ హీరో అనిపించుకున్నాడు. వరస పెట్టి గ్యాపు లేకుండా మూడు సినిమాలకు చెమటోడ్చిన వరుణ్ తేజ్ గత నెల రోజులుగా రిలాక్స్ అవుతూ కన్పించాడు. ఇక నాలుగో ప్రాజెక్టు కోసం మళ్ళీ ఇదిగో సమాయత్తమవుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా కొత్త చిత్రానికి ఈ నెలలోనే ముహూర్తం ఖరారయింది. రానున్న కొద్ది రోజుల్లోనే తేదీ, సమయం కూడా అఫీశియలుగా బయటికి రానున్నాయి. కానీ ఈ ఒక్క చిత్రంతో వరుణ్ దూకుడు ఆగేలా లేదు. జూన్ నెలకల్లా ఈ సినిమా కంప్లీట్ చేసి దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో వెంకీ అట్లూరిని దర్శకుడిగా పరిచయం చేయబోతున్న కొత్త ప్రాజెక్టుకి మే, జూన్ నుండి కాల్షీట్స్ ఇచ్చేసాడు. అంటే ఈ ఏడాదిలో వరుణ్ తేజ నుండి రెండు సినిమాలు ఖచ్చితంగా రిలీజుకి ఉండబోతున్నాయి. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్ కదా!