స్పీడున్నోడు సినిమా పట్ల రిలీజుకు ముందు విపరీతమైన పాజిటివ్ బజ్ రావడానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో అవడం ఒక పాయింట్ అయితే తమన్నా ఐటెం సాంగ్ సెకండ్ అడ్వాంటేజ్. వీటికి తోడు తమిళంలో హిట్టయిన సుందర పాండ్యన్ కథను రీమేక్ స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాస రావు గారు డీల్ చేయడం మరో సెల్లింగ్ పాయింట్ అయింది. కథనంలో పట్టు లేకపోతే ఎన్ని అదనపు ఆకర్షణలున్నా సినిమా విజయానికి తోడ్పడవని రుజువు చేసే దిశలో స్పీడున్నోడు ప్రయాణిస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. రెండవ రోజు నుండే కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయని, ఈ పరిస్థుతులలో దండిగా డబ్బులు పోసి కొనుక్కున్న బయ్యర్లు, విపరీతమైన బడ్జెట్ పెట్టిన నిర్మాతలకు నష్టాలు తప్పేలా లేవంటున్నారు. అల్లుడు శీనులో కూడా తమన్న ఐటెం సాంగ్ ఉండడం, అందుకే ఆ సినిమా కొద్దో గొప్పో వసూళ్లు రాబట్టడం సెంటిమెంటుగా ఫీలయిన బెల్లంకొండ అండ్ భీమనేనిలు భారీ మొత్తం చెల్లించుకొని మరీ బ్యాచిలర్ బాబు పాటను తీసారు. ఫైనలుగా తమన్నా ప్రెజెన్స్ కూడా సినిమాను సేవ్ చేసేలా లేదు.