Advertisementt

దేవుడు పవన్ సినిమా తర్వాత భక్తుడు సినిమానే!

Sun 07th Feb 2016 07:54 PM
pawan kalyan,sardaar gabbar singh,nithiin,a aa,trivikram srinivas,brahmotsavam,sarrinodu  దేవుడు పవన్ సినిమా తర్వాత భక్తుడు సినిమానే!
దేవుడు పవన్ సినిమా తర్వాత భక్తుడు సినిమానే!
Advertisement
Ads by CJ

సమ్మర్‌ బెర్త్‌లు కన్‌ఫర్మ్‌ చేసుకునే పనిలో మన హీరోలు బిజీబిజీగా ఉంటున్నారు. కాగా ఇప్పటివరకు పవన్‌కళ్యాణ్‌ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' మాత్రమే డేట్‌ను ఫిక్స్‌ చేసుకుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా పవన్‌ భక్తుడైన నితిన్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మాతగా తెరకెక్కుతోన్న 'అ..ఆ' చిత్రం వాస్తవానికి ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సివుంది. కానీ సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోవడం, తాజాగా ఆ స్థానంలో మిక్కీ.జె.మేయర్‌ను తీసుకోవడంతో పాటు మరికొన్ని సాంకేతిక కారణాల వల్ల 'అ..ఆ' చిత్రం ఏప్రిల్‌లోనే విడుదలకు ముహూర్తం చూసుకుంది. తన దేవుడైన పవన్‌ 'సర్దార్‌'కు రెండు వారాల గ్యాప్‌ తీసుకొని ఏప్రిల్‌ 22న ఈ 'అ..ఆ' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అనసూయ రామలింగం వరెస్‌ ఆనంద్‌ విహారి'గా రానున్న ఈ చిత్రానికి డేట్‌ను లాక్‌ చేయడంతో ఇక సమ్మర్‌కు రానున్న మహేష్‌ 'బ్రహ్మూెత్సవం', బన్నీ 'సరైనోడు' డేట్లు మాత్రం ఇంకా ఫిక్స్‌కాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేష్‌ 'బ్రహ్మూెత్సవం' ఏప్రిల్‌ 29న విడుదలకు సిద్దమవుతోంది. ఇక బన్నీ 'సరైనోడు'ను మొదట బన్నీ బర్త్‌డే కానుకగా ఏప్రిల్‌ 8న విడుదల చేయాలని భావించారు. కానీ అదేరోజు పవన్‌ వస్తుండటంతో బన్నీ అదే డేట్‌కు ఫిక్స్‌ అవుతాడా? లేక గ్యాప్‌ తీసుకొని వస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ