అటు ఆంధ్ర ప్రదేశ్ నాట నందమూరి కుటుంబం, ఇటు తెలంగాణాలో కల్వకుంట్ల వారి కుటుంబం రాజకీయాలకు ప్రసిద్ది. అటు తాతయ్య NTR నట వారసత్వాన్ని నిర్విగ్నంగా కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీయార్, ఇటు తండ్రి KCR రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే అన్ని అర్హతలు పుష్కలంగా కలిగున్న KTRల మధ్య దోస్తీ గూర్చి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. మీడియా దృష్టికి పెద్దగా చిక్కలేదు కానీ వీరిద్దరూ మంచి స్నేహితులు. ఆ మైత్రి ఆధారంగానే తారక్ ఒకసారి KTRని నాన్నకు ప్రేమతో చిత్రం వీక్షించవలసిందిగా కోరడం జరిగింది. అప్పుడు GHMC ఎన్నికల ప్రక్రియలో తలమునకలై ఉన్న KTR తప్పకుండా మూవీ చూస్తానని మాటిచ్చారు. ఇక నిన్నటితో KTR శ్రమ ఫలించి హైదరాబాద్ నగరం ఎన్నడూ చూడని ప్రతిష్టాత్మకమైన GHMC ఫలితం TRS గెలుపుతో పరిపూర్ణమైంది. ఈ సంతోషంలో నేడు సాయంత్రం బంజారా హిల్స్ PVR సినిమా హాల్లో KTR నాన్నకు ప్రేమతో చిత్రాన్ని వీక్షించారు. విషయం తెలుసుకున్న తారక్ కూడా చాలా ఆనందపడిపోయారు. రాజకీయ వాగ్ధానాలే కాదు ఫ్రెండుకి ఇచ్చిన మాటను కూడా గుర్తుంచుకొని నేడు తీరిక సమయంలో సినిమా చూసిన KTR, NTR ఫ్రెండ్ షిప్ నిజంగా ముచ్చటేస్తోంది కదూ!