ఓ సినిమా విషయంలో బయ్యర్లు నష్టపోతే అందులో కొంత మొత్తాన్ని ఆయా బయ్యర్లుకు తిరిగి ఇవ్వడంలో సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్, పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబులు ముందుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే వీరు తమ రెమ్యూనరేషన్‌లో ఎంతో కొంత మొత్తాన్ని మాత్రమే ఇంతకాలం తిరిగి ఇచ్చిన సంఘటనలు చూశాం. కానీ తాజాగా బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్‌ఖాన్ ఈ విషయంలో మరో అడుగుముందుకేశాడు. ఆయన హీరోగా ఇటీవల వచ్చిన 'దిల్‌వాలే' చిత్రం బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రంతో పాటు 'బాజీరావ్‌మస్తాని' చిత్రం కూడా ఒకే రోజు విడుదల కావడంతో ఈ చిత్రం ఓపెనింగ్స్‌పై కూడా ఆ ప్రభావం పడింది. అంతేగాక అమీర్‌ఖాన్ చేసిన 'అసహనం' కామెంట్స్‌కు షారుఖ్ కూడా అనుకూలంగా స్పందించడంతో ఈ చిత్రం కొన్ని రాష్ట్రాల్లో అనుకున్న సమయానికి విడుదల కాలేదు. దాంతో కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న చందంగా 'దిల్‌వాలే' చిత్రం బయ్యర్లకు చాలా నష్టాన్ని మిగిల్చింది. ఈ చిత్రానికి 240కోట్లు బిజినెస్ కాగా కలెక్షన్లు మాత్రం కేవలం 150కోట్ల లోపే వచ్చాయి. దాంతో షార్‌ఖ్‌ఖాన్ ఈ చిత్రం బయ్యర్లందరినీ పిలిచి బయ్యర్లు నష్టపోయిన మొత్తంలో ఏకంగా 50శాతం నష్టాలను తానే పూడుస్తానని హామీ ఇచ్చాడు.ఈ లెక్కన చూసుకుంటే నష్టాల్లో సగం అంటే ఆయన రెమ్యూనరేషన్‌ను దాటి చేతి డబ్బులు కూడా బాగా పడే అవకాశం ఉంది. దీంతో బయ్యర్లలందరితో పాటు బాలీవుడ్ వర్గాలు సైతం ఈ విషయంలో షార్‌ఖ్ ఔదార్యాన్ని ఎన్నోళ్ల పొగుడుతున్నాయి.