ప్రభాస్ వంటి స్టార్‌హీరో 'బాహుబలి2' తర్వాత దొరుకుతాడా? అప్పటికి ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో తెలియదు. దాంతో ముందుచూపుతో మహేష్‌బాబుతో 'శ్రీమంతుడు' చేసిన మైత్రీ మూవీస్ అధినేతలు ప్రభాస్ డేట్స్‌ని లాక్ చేశారు. మైత్రి మూవీస్ అధినేతలకు, మహేష్‌బాబుకు ఉన్న అనుబంధంతో మహేష్ ఈ ఆలోచన ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మైత్రి మూవీస్ వారు తాము చేయబోయే చిత్రాల గురించి, హీరోల డేట్స్ గురించి మహేష్‌తో మాట్లాడి ఆయన సలహాలు తీసుకుంటున్నారని టాక్. ఈ విషయంలోనూ ఇదే జరిగిందని అంటున్నారు. ఏదో ఒక హీరో అండ ఉంటేనే ఇండస్ట్రీలో పచ్చగా ఉండగలమనే విషయం మైత్రి మూవీస్ మేకర్స్‌కు బాగా తెలుసంటున్నారు. మైత్రి మూవీస్ వారు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ హీరోగా 'జనతాగ్యారేజ్' చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే సమయానికి 'బాహుబలి2' కూడా పూర్తవుతుందని, అప్పుడు ప్రభాస్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసి ఆయన్ను బుక్ చేసుకున్నారు. దర్శకుడిగా కూడా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ప్రభాస్ డేట్స్ తీసుకొని తమ దగ్గర పెట్టుకున్నారు. ఈమేరకు ప్రభాస్‌కు భారీగానే అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం.