ప్రవీణ్ సత్తారు నుండి వస్తున్న కొత్త చిత్రం గుంటూర్ టాకీస్ టీజర్ మొన్నే బాలకృష్ణగారి చేతుల మీదుగా విడుదలయ్యి మంచి టాక్ సంపాదించింది. జబర్దస్త్ రేష్మి, కొత్త హీరో సిద్దు, నరేష్, శ్రద్ధ దాస్ తదితరులు నటించిన ఈ చిత్రం రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయి. టీజర్ చూసి బాగా ఇంప్రెస్ అయిన నిర్మాత అండ్ పంపిణీదారుడు కొర్రపాటి సాయిగారు గంపగుత్తగా సినిమా మొత్తాన్నినిన్నే కొనేసారు. చిన్న సినిమాలలో విషయం ఉందనిపిస్తే, దగ్గరుండి మరీ ప్రాజెక్ట్ టేకప్ చేసి అందరికీ లాభాలని పంచుతున్న సాయిగారు మొన్నటికి మొన్న ఓంకార్ రాజు గారి గదిని, అటు తరువాత ఓంకార్ తమ్ముడు అశ్విన్ చేసిన జత కలిసే చిత్రాలని కూడా విజయాల బాట పట్టించారు. ఓ సినిమాను నానా కష్టాలు పడి అనుకున్న సమయంలో పూర్తి చేసి, రిలీజ్ టైం వచ్చేసరికి పేదరికంతో సొమ్మసిల్లిపోయే నిర్మాతలు, దర్శకులు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటె జనాల చేత ఎలా ఒప్పించాలో, బాక్సాఫీసుని ఎలా మెప్పించాలో సాయి గారికి తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో. అందుకే గుంటూర్ టాకీస్ లక్కీగా సేఫ్ హ్యాండులో ల్యాండ్ అయింది.