పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఆయనతో విడిపోయిన తర్వాత దర్శకత్వం, సినిమాల నిర్మాణం వైపు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠి చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు గతంలో చాలా ప్రయత్నాలు చేసింది. పలు కారణాలతో ఈ సినిమాను ఇప్పటికీ తెలుగులో విడుదల చేయలేకపోయింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రం తెలుగులో వస్తోంది. అది కూడా థియేటర్లలో కాదు..! టీవీ చానెల్‌లో...! ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను ఈ టీవీ కొనుగోలు చేసింది. గతంలో ఈ సినిమా విడుదల సమయంలో తాను అనారోగ్యం పాలవ్వడం వల్ల అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయానని, కానీ ఇప్పుడు ఈ సినిమా త్వరలో ఈటీవీలో రాబోతోందని త్వరలోనే డేట్‌ను ప్రకటిస్తామని రేణుదేశాయ్ చెబుతోంది. పవన్‌కళ్యాణ్‌కు రామోజీరావుతో ఉన్న సత్సంబంధాలతో ఈ చిత్రాన్ని పవన్ రికమెండ్ చేసి మరీ ఎక్కువ రేటు ఇప్పించాడట. మరి ఈ చిత్రంతో రేణుదేశాయ్ టాలెంట్‌ను చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు కలుగనుంది.