దర్శకనిర్మాత వైవిఎస్ చౌదరి చివరి చిత్రంగా తెరకెక్కించిన చిత్రం 'రేయ్'. మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ మొదలు పెట్టిన ఈ చిత్రాన్ని చౌదరి ఆర్థికంగా చాలా కష్టనష్టాలకు ఓర్చి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నష్టాలను మిగల్చడంతో ఆయన పరిస్థితి చేయిదాటిపోయింది. అప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న చౌదరి గుడివాడలోని తన 'బొమ్మరిల్లు' థియేటర్‌ను తాకట్టుపెట్టి ఆంధ్రాబ్యాంకు నుండి లోన్ తీసుకున్నాడు. తాను తీసిన సినిమాలు నష్టాలే తప్ప ఒక్క పైసా కూడా లాభం తేకపోవడంతో రుణం తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. థియేటర్ మీద తీసుకున్న బకాయిలను చెల్లించపోవడంతో ఆంధ్రా బ్యాంకు అధికారులు ఈ థియేటర్‌ను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇది తెలిసిన అందరూ పాపం.. వైవిఎస్ చౌదరి అంటున్నారు.