ఓవర్‌సీస్‌లో వసూళ్లు తెలుగు సినిమాకు చాలా కీలకంగా మారాయి. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా సినిమా బాగుంటే చాలు.. అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి, డాలర్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ జనవరి సీజన్‌లో ఓవర్‌సీస్ నుండి తెలుగు సినిమాలకు దాదాపుగా 30కోట్ల వసూళ్లు లభించాయి. 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఓవర్‌సీస్‌లో నెంబర్‌వన్‌గా కొనసాగుతోంది. అక్కడ మూడో వారంలోనూ ఈ సినిమా జోరు చూపిస్తోంది. మొత్తానికి ఇప్పటివరకు 14కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానంలో 'సోగ్గాడే చిన్నినాయనా' నిలిచింది. ఈ చిత్రానికి 5.5కోట్లు రాగా, 'ఎక్స్‌ప్రెస్ రాజా' దాదాపు 3కోట్లు వసూలు చేసింది. ఇక 'డిక్టేటర్' మాత్రం కేవలం రెండు కోట్లు మాత్రమే రాబట్టింది., ఈ సినిమా ఓవర్‌సీస్‌తో పాటు ఇక్కడ కూడా 'ఎ' సెంటర్లలో కూడా చేతులెత్తేసి కేవలం బి,సి కేంద్రాలల్లోనే ఓ మోస్తరు వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.